అనకాపల్లి జిల్లాలో భారీ దొంగతనాల ముఠా గుట్టురట్టు – ముగ్గురు నిందితుల అరెస్ట్
సుమారు ₹80.33 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం
సాంకేతిక పరిజ్ఞానం, పోలీసుల సమష్టి కృషితో 28 కేసుల ఛేదన పరవాడ డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు గారు అధికారులు, సిబ్బంది ప్రతిభను ప్రశంసించిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు దొంగతనాల కేసులను జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ బి.మోహన రావు గారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (క్రైమ్స్) శ్రీ ఎల్.మోహన రావు గారు కేసు వివరాలను అధికారికంగా వెల్లడించారు.
