పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ వేస్తే.. చర్యలు తప్పవు: CV ఆనంద్ తెలంగాణ : పోలీసులు యూనిఫామ్‌లో డ్యాన్స్ చేయడం, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను హెచ్చరించారు. ఇటీవల పోలీసుల యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్ అవ్వడంతో పోలీసు శాఖ క్రమశిక్షణపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, డీజీపీ స్పందిస్తూ, పోలీసు యూనిఫామ్ బాధ్యత, అధికారం, క్రమశిక్షణకు ప్రతీక అని, దాని గౌరవాన్ని కాపాడాలని సూచించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన సిబ్బందిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.