టీఎస్ జేయు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా పంతం సురేందర్.
టీఎస్ జేయు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన పంతం సురేందర్ ను నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ సురేందర్ కు నియామక పత్రం అందజేసి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘం బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ నియామక పత్రం అందజేసే కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఘనపనేని చంద్రశేఖర్, మహబూబాబాద్ జిల్లా సభ్యులు గాదె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
