పాపేపల్లి క్రాస్‌లో రెండు ఆటోలు ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు
పెద్దమండ్యం:అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం పాపేపల్లి క్రాస్ వద్ద మంగళవారం ఉదయం రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. పాల ఆటో ప్రయాణికుల ఆటోను ఢీకొనడంతో ప్రయాణికుల ఆటోలో ఉన్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు క్షతగాత్రులను పెద్దమండ్యం 108 అంబులెన్స్‌లో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
