మళ్లీ ప్రారంభమైన పాపికొండల విహారయాత్ర!!
రాజమండ్రి : గోదావరి వరదల కారణంగా గత 70 రోజులుగా నిలిచిపోయిన పాపికొండల బోటు షికారు మంగళవారం నుండి పునఃప్రారంభమైంది. రంపచోడవరం సబ్ కలెక్టర్ అనుమతులతో ఏపీటీడీసీ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 16 బోట్లను సిద్ధం చేశారు. దసరా సెలవుల నేపథ్యంలో పర్యాటకులు లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా ధరించాలని, సెల్ఫీలు, బోటు అంచుల పై నిలబడటం వంటి ప్రమాదకర పనులు చేయవద్దని అధికారులు స్పష్టంచేశారు. చింతూరు ఐటీడీఏ పీవో బోట్లను తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలను సమీక్షించారు.
