అమరావతి : ఏపీ రాష్ట్రంలో 106 మున్సిపాలిటీల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి కేటాయింపుల్లో మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్య తనిస్తూ ఏకంగా 50 శాతం సీట్లను కేటాయించడం విశేషం.. బీసీలకు 36, ఎస్సీలకు 14, ఎస్టీలకు 3, జనరల్ మహిళలకు 27 స్థానాలు అలాగే అర్రిజర్వ్ కింద 26 స్థానాలు ఖరారయ్యాయి. దీంతో స్థానిక ఎన్నికల రాజకీయం మరింత ఊపందుకుంది.