రాయచోటి: పత్రాలు లేని వాహనదారులకు చలానాలు
రాయచోటి పట్టణంలోని బంగ్లా సమీపంలో ట్రాఫిక్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన వాహన పత్రాలు లేని వాహనదారులను తనిఖీ చేసి చలానాలు విధించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ తదితర పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎస్ఐ సుధాకర్ రెడ్డి కోరారు.
