ఓటు హక్కుల పరిరక్షణకు ఢిల్లీలో గళమెత్తిన తెలంగాణ నేతలు.. ప్రజాస్వామ్య పోరాటంలో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం ఆగదు.. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును రక్షించాలి ఓటర్ల జాబితాలో పారదర్శకతకు డిమాండ్.. రాజ్యాంగ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా నిరసన న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల ఓటు హక్కుల రక్షణే లక్ష్యంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి వారు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు తమ మద్దతు తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, ఓటర్ల జాబితాలో పారదర్శకతను నిర్ధారించాల్సిన బాధ్యత ఎన్నికల వ్యవస్థపై ఉందని నాయకులు స్పష్టం చేశారు. ఓటు అనేది కేవలం ఎన్నికల్లో పాల్గొనే హక్కు మాత్రమే కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అన్నారు.