కేజీ బియ్యం రూ.100.. మంత్రి తుమ్మల ఆందోళన!
TG: రాబోయే కొద్ది రోజుల్లో కేజీ బియ్యం ధర రూ.100కి పెరిగే అవకాశం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎల్నినో కారణంగా తీవ్ర సంక్షోభం పొంచి ఉందని, భవిష్యత్తులో తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి రావొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భజలాలు క్షీణిస్తున్నాయని, రిజర్వాయర్లలో నీటి నిల్వ డెడ్ స్టోరేజీకి చేరిందని తెలిపారు. రానున్న యాసంగి సీజన్లో బోర్లను నమ్ముకొని పంటలు వేయొద్దని సూచించారు.
