అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం బియర్గుడి పంచాయతీ కాపుపల్లెకు చెందిన నాగరత్నమ్మ (45) హత్య కేసులో నిందితుడు భర్త నరసింహులును ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 7న భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో నరసింహులు రోకలిబండతో దాడి చేయగా, తీవ్రంగా గాయపడిన నాగరత్నమ్మ తిరుపతి రిమ్స్‌లో చికిత్స పొందుతూ 8న మృతి చెందింది. పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు గాలించి పట్టుకున్నారు. భార్య కువైట్ వెళ్లేందుకు పాస్‌పోర్టు చేయించుకోవడాన్ని జీర్ణించుకోలేక దాడి చేసినట్లు డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు పంపుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఐ కృష్ణరాజు నాయక్, ఎస్‌ఐ గోల్కొండ శోభ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.