మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన అంగన్వాడీ టీచర్ల నియామకం కొరకు నోటిఫికేషన్ లో విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 23 గా అధికారులు తెలిపారు అంగన్వాడి టీచర్లతో పాటు ఆయా నియామకాలను చేపట్టడానికి కూడా నోటిఫికేషన్ విడుదల అయింది ఇందులో అంగన్వాడీ టీచర్లుగా 153 మందికి మరియు ఆయాలుగా 280 మందికి అవకాశం కల్పించనున్నారు ఆశావాహులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి