రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం
ఏలూరు: వట్లూరు - ఏలూరు రైల్వే స్టేషన్ల మధ్య సీఆర్ రెడ్డి కళాశాల వెనుక భాగంలో రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో అతడి దేహం రెండు ముక్కలైంది. పట్టాలపై మృతదేహాన్ని గమనించిన కీమెన్ ఇచ్చిన నివేదిక మేరకు.. రైల్వే స్టేషన్ మాస్టర్ ఏలూరు జీఆర్పీ (GRP) పోలీసులకు సమాచారం అందించారు.
మృతుడి వయసు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుంది. సుమారు 5 అడుగుల ఎత్తు, గుండ్రటి ముఖం, చామనఛాయతో ఉన్నాడు. ఒంటిపై నలుపు రంగు ప్యాంటు, నలుపు రంగు రెడీమేడ్ షర్టు ఉన్నాయి. మృతుడు ఎవరనేది, ఏ ఊరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న ఏలూరు జీఆర్పీ ఎస్ఐ వై.కె. దానం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి వివరాలు లేదా ఆచూకీ తెలిసిన వారు 9440 411000 నంబర్లో సంప్రదించాలని కోరారు.
