పాలమూరు: ACBకి చిక్కిన గవర్నమెంట్ ఆఫీసర్ కందడ వెంకటయ్య
మహబూబ్‌నగర్ రేంజ్ పరిధిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించి లంచం తీసుకుంటున్న అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అచ్చంపేట సబ్-డివిజనల్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కందడ వెంకటయ్య రూ.25,000 లంచం డిమాండ్ చేసి రూ.3 వేల నగదు రూ.22 వేల ఫోన్ పే తీసుకుంటూ ACB అధికారులకు చిక్కారు.
