తెలంగాణ సచివాలయానికి మంచినీటి సరఫరా నిలిపివేత ..
*తెలంగాణ సచివాలయానికి నిలిచిపోయిన మంచినీటి సరఫరా!*
- రూ.50 లక్షల వాటర్ బిల్లులు బకాయి ఉండటంతో మంచినీటి సరఫరా నిలిపివేత
* తెలంగాణ సచివాలయంలో మంచినీటి సరఫరా నిలిచిపోయింది. సచివాలయానికి వాటర్ క్యాన్లు సరఫరా చేసే నాలుగు ప్రైవేటు ఏజెన్సీలకు సుమారు రూ.50 లక్షల బకాయిలు ఉండటంతో కాంట్రాక్టర్లు సరఫరాను నిలిపివేసినట్లు సమాచారం.
* పాత బిల్లులు క్లియర్ చేస్తేనే తిరిగి వాటర్ క్యాన్లు సరఫరా చేస్తామని కాంట్రాక్టర్లు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
* దీంతో సచివాలయంలోని ఉద్యోగులు, సిబ్బంది ఎవరి వాటర్ బాటిల్స్ వారే తెచ్చుకోవాలని ఆయా పేషీల అధికారులు సూచించినట్లు సమాచారం.
* ప్రభుత్వ కార్యాలయంలోనే తాగునీటి సరఫరా నిలిచిపోవడంపై ఉద్యోగుల్లో చర్చ
* రూ.50 లక్షల బకాయిలు ఎందుకు చెల్లించలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
