రేపటి నుంచి తెలంగాణలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు!
తెలంగాణ రాష్ట్ర వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి, ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశం ఉందని తాజాగా గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలిపారు.
ఈ నేపథ్యంలో సమావేశాల నిర్వహ ణ, వసతులు, భద్ర తా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధి కారులు, పోలీసుశాఖ ఉన్నతాధికారులతో శనివారం సాయంత్రం శాసన పరిషత్ సమావేశ మందిరం లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ క్రమంలో పోలీస్, ఇంటలిజెన్స్ విభా గాలు అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. రేపటి నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని స్పీకర్ కోరారు. అలాగే అన్ని శాఖల అధికారులను అందుబాటులో ఉంచుతామన్నారు.
