లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీడీపీఓ
మెట్పల్లి: అంగన్వాడీ కేంద్రాల తనిఖీల్లో అనుకూల నివేదికల కోసం లంచం డిమాండ్ చేసిన జగిత్యాల జిల్లా మెట్పల్లి సీడీపీఓ దరోజు పద్మ రూ. 63,000 తీసుకుంటూ కరీంనగర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
మెట్పల్లి అర్బన్ మండల పరిధిలోని 21 అంగన్వాడీ కేంద్రాల నుంచి నెలకు రూ. 1,000 చొప్పున, మూడు నెలలకు గాను రూ. 63,000 (కేంద్రానికి రూ. 3,000) లంచం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, శనివారం కార్యాలయ ఆవరణ వెలుపల ఫిర్యాదుదారుడి నుంచి నగదు తీసుకుంటుండగా సీడీపీఓను అదుపులోకి తీసుకుని లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
