రామప్ప రుద్రేశ్వరునికి నిత్యం జలాభిషేకం!
ములుగు జిల్లా:సెప్టెంబర్ 06
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయం లో ఒక చారిత్రక ఘట్టం చోటు చేసు కుంది,300 ఏళ్లుగా నిలిచిపోయిన పూర్తిస్థాయి నిత్య జలాభిషేకం శనివా రం సాయంత్రం నుం డి ప్రారంభమైంది.
ఆలయంలో కొలువు దీరిన రుద్రేశ్వరుడికి 17వ శతాబ్దంలో భూకంపం సంభవించినప్పటి నుంచి సోమసూత్రం ఆలయ గర్భగుడి నుంచి నీరు బయటకు వెళ్లే సంప్రదాయ మార్గం మూసుకుపోయింది. దీంతో పరిపూర్ణమైన అభిషేకాలు కరువయ్యాయి.
ఈ క్రమంలో ఇన్నేళ్ల తర్వాత రామప్ప ఆలయంలో ఆధునిక పరికరాలతో శాస్త్రీయ పరిరక్షణ పద్ధతులను అనుసరి స్తూ పునరుద్ధరణ పనులను చేపట్టారు. ఈ ప్రక్రియలో 3డీ మ్యాపింగ్, ఎండో స్కోపిక్, జీవోప్రో కెమె రాలతో రియల్‌టైమ్ మానిటరింగ్ స్ర్కీన్ల ద్వారా పర్యవేక్షించా రు.
దేవాలయ నిర్మాణా నికి ఎటువంటి నష్టం కలగకుండా సాఫ్ట్ డ్రిల్లింగ్ విధానంలో పొరలు పొరలుగా అడ్డంకులను జాగ్రత్త గా తొలగించారు. దీంతో సోమసూత్రం ఎట్టకేలకు పునరుద్ధ రణకు నోచుకుంది. ఈ పనులను దేవాదాయశాఖ అధికారుల సమక్షం లో ఎఎస్ఐ హైదరాబాద్ సర్కిల్ బృందం ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు.
ఇన్‌టాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండు రంగారావు, కేంద్ర పురావస్తు శాఖ డీఈ కృష్ణచైతన్య, ఉమ్మడి వరంగల్ జిల్లా సీఏ లు మల్లేష్, కృష్ణ వంశీ, రామప్ప ఆల య ఈవో ఇమ్మడి భాస్కర్ సమక్షంలో పునరుద్ధరణ పనులనుచేపట్టారు.
