కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు కొండాపురం సర్కిల్ పరిధిలోని సుగుమంచిపల్లి, బుక్కపట్నం గ్రామాల్లో పోలీసులు విస్తృత 'మెగా కార్డన్ సెర్చ్' నిర్వహించారు. కొండాపురం సి.ఐ రాజా ఆధ్వర్యంలో, సబ్ డివిజనల్ పోలీసు సిబ్బందితో కలిసి సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మహిళా భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ అందిస్తున్న సేవలు, శక్తి యాప్ ఉపయోగాలను వివరించి, అక్కడికక్కడే 18 మంది మహిళల ఫోన్లలో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు.అనంతరం నిర్వహించిన వాహన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గ్రామాల్లోని రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్ల వివరాలను పరిశీలించి, వారి కదలికలపై నిఘా ఉంచినట్లు తెలిపారు.ప్రజల భద్రత,శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఇలాంటి కార్డన్ సెర్చ్‌లు,వాహన తనిఖీలు నిరంతరంకొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాళ్ల ప్రొద్దుటూరు ఎస్.ఐ మంజునాథ, కొండాపురం సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.