నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును.
YSRCP రాష్ట్ర స్థాయి పిలుపు నేపథ్యంలో ది. 21.09.2026న చేపట్టదలిచిన ధర్నా, ర్యాలీలు మరియు ఇతర కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించబడినవి.
డి.ఎస్.సి. నియామకాల్లో జరిగిన అవకతవకల ఆరోపణల నేపధ్యంలో నిరసన తెలిపేందుకు ది. 21.09.2026 తేదీన YSRCP పార్టీ వారు రాష్ట్ర స్థాయి పిలుపులో భాగంగా NTR పోలీస్ కమిషనరేట్ పరిధిలో నియోజకవర్గ స్థాయిలో ధర్నా, ర్యాలీ మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతులు కోరినారు. ఈ నేపధ్యంలో నగరంలో BNSS సెక్షన్ 163 మరియు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున మరియు నగరంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని అటువంటి కార్యక్రమాలకు స్థానిక పోలీస్ అధికారుల వద్ద నుండి అనుమతులు నిరాకరించబడినవి.
అదేవిధంగా నగరంలో వినాయక నిమర్జన కార్యక్రమాలు, ఊరేగింపులు, ట్రాఫిక్ అంతరాయాలు, పోలిస్ సిబ్బంది కొరత దృష్టిలో ఉంచుకుని పైన తెలిపిన నిరసన కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించబడినవి.
అమలులో ఉన్న ఉత్తర్వులను ఉల్లంఘించిన పక్షంలో, సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం తగిన క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి.
ఈ సందర్బంగా రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పై విషయలను దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని డిప్యూటి పోలీస్ కమీషనర్ శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్. గారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డి.సి.పి. గారితో పాటు సెంట్రల్ ఏ.సి.పి శ్రీ కె దామోదర రావు గారు, ఇన్పెక్టర్లు శ్రీ పవన్ కిషోర్ గారు, శ్రీ చంద్ర శేఖర్ గారు, శ్రీ రమేష్ గారు, శ్రీ చవాన్ గారు, శ్రీ మురళి కృష్ణ గారు తదితరులు పాల్గొన్నారు .
