లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ రెవెన్యూ అధికారి
ఆయన ఒక మండల అధికారి ప్రజల సమస్యలను పరిశీ లించి పరిష్కరించే మెజిస్ట్రేట్ లాంటి అధికారే లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు,
ములుగు జిల్లా గోవిందరావుపేట తహసిల్దార్ సృజన్ కుమార్, మండల పరిధిలోని ఓ భూమికి సంబంధించి ఎకరం 5 గుంటల భూమి యజమాని మృతి చెందడంతో ఆ భూమిని వారసురా లైన అయన కుమార్తె పేరు పై పౌతి మార్పిడి చేసి ఆమెకు పట్టా ఇచ్చేందుకు 14 వేల రూపాయలు డిమాండ్ చేయడం తో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
దీంతో ఏసీబీ అధికారులు శుక్రవారం పథకం ప్రకారం.. తాసిల్దార్ కార్యాలయంలో బాధితుల నుంచి 14 వేలు లంచం తీసుకుంటుండగా సృజన్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పి సాంబయ్య మాట్లాడుతూ...
మృతుని కుమార్తె పేరు పైకి భూమి మార్పిడి ప్రక్రియ కు14 వేల రూపాయ లు ఇవ్వవలసిందే నని, తాసిల్దార్ డి మాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళిక తో తాసిల్దార్ కార్యాలయంలో దాడులు నిర్వహించి నట్లు ఆయన తెలిపారు.
లంచం తీసుకుం టుండగా పట్టుబడిన సొమ్మును సీజ్ చేసి, అదుపులోకి తీసు కున్న తహసిల్దార్ సృజన్ కుమార్ ను రేపు వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరచ నున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.
