సత్తుపల్లి మరియు కల్లూరు మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన పలు అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో సంబంధిత ఉన్నతాధికారులను కలిశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ CMD శ్రీమతి T.K. శ్రీదేవి గారు, IAS మరియు ప్రభుత్వ సెక్రటరీ డా. క్రిస్టియానచౌట్ గారిని కలిసి మున్సిపాలిటీలలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై వినతిపత్రం అందజేశారు.

మున్సిపాలిటీల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఎమ్మెల్యే గారు అధికారులకు స్వయంగా వివరించి, ప్రతిపాదిత అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీల పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి, పట్టణ సుందరీకరణ, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు సంబంధించిన పనులను ప్రాధాన్యతతో చేపట్టాలని అధికారులను కోరారు.

మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వసతులు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు తెలిపారు.