బొమ్మనహళ్ మండలం LB నగర్ సమీపంలో వినాయక నిమజ్జన వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. SI నబీరసూల్ వివరాల ప్రకారం.. ఉప్పరహాల్ క్రాస్కు చెందిన సాయిభరత్(22) నిమజ్జనం అనంతరం ఈత రాకపోయినా HLC కాలువలోకి దూకి మునిగిపోయాడు. స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినా నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. గజ ఈతగాళ్లు, నీటి అడుగున కనిపించే కెమెరాలు తెప్పించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.