టౌన్: మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న నిందితుడిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.అమ్మచెరువుమిట్ట వద్ద వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న పూజారి మహేష్ (26), దండువారిపల్లె, తనకల్లు మండలం, సత్యసాయి జిల్లాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అప్పుల కారణంగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడినట్లు అంగీకరించాడు. అతడి వద్ద నుంచి 12.150 గ్రాముల బంగారు చైన్, 19 గ్రాముల వన్ గ్రామ్ గోల్డ్ చైన్, విక్రయించగా వచ్చిన రూ.1.90 లక్షలు, నేరానికి వాడిన AP40-LM-4176 హీరో డెస్టినీ బైక్ స్వాధీనం చేసుకున్నారు.

వన్ టౌన్ లో 2 కేసులు, బి.కొత్తకోటలో ఒక కేసులో అతడి ప్రమేయం ఉన్నట్లు తేలింది. జోగప్పగారి వీధి, పీ&టీ కాలనీ, బురకాయల కోటలో మహిళల నుంచి చైన్లు లాక్కెళ్లినట్లు పోలీసులు తెలిపారు.