గుంటూరు జిల్లా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు బహిరంగ ప్రదేశాల్లో మందుబాబుల వేధింపుల నుంచి మహిళలు, సాధారణ పౌరులకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ‘ఓపెన్ డ్రింకింగ్’ (Open Drinking) పై ప్రత్యేక తనిఖీలు (Special Drive) నిర్వహించడం జరిగింది.

👉జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ముఖ్యమైన కూడళ్లు, వైన్ షాపుల సమీప ప్రాంగణాలు, ఖాళీ స్థలాలు, పార్కులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు మరియు నిర్మానుష్య రహదారులలో తనిఖీలు చేపట్టారు.

ముఖ్య విశేషాలు & చర్యలు:

 * కేసుల నమోదు: జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని, సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది.

  కౌన్సెలింగ్: బహిరంగంగా మద్యం సేవించడం నేరమని, దీనివల్ల సమాజంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందని అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

 ▶️*జిల్లా ఎస్పీ గారి సందేశం:* 

సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనూ సహించేది లేదు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మహిళలు, చిన్నపిల్లలు ధైర్యంగా రోడ్లపై తిరిగే వాతావరణం కల్పించడమే మా ప్రాధాన్యత. మద్యం షాపుల యజమానులు కూడా తమ షాపుల వద్ద లేదా పరిసరాల్లో బహిరంగంగా మద్యం తాగేందుకు అనుమతిస్తే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ స్పెషల్ డ్రైవ్స్ ఇకపై కూడా నిరంతరం కొనసాగుతాయి

🔸ప్రజలకు విజ్ఞప్తి:

మీ ప్రాంతంలో ఎక్కడైనా బహిరంగంగా మద్యం సేవించడం, గొడవలు చేయడం లేదా మహిళలకు ఇబ్బంది కలిగించే సంఘటనలు మీ దృష్టికి వస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు గానీ, లేదా 100 / 112 నంబర్లకు సమాచారం అందించగలరు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచబడతాయి.