గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు ప్రోత్సాహం
గ్రామీణ క్రీడాకారుల ను ప్రోత్సహించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. మంథని లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడా మైదానం లో ఈ నెల 8న మంథని రూరల్, మంథని అర్బన్, ముత్తారం, రామగిరి ఎస్జీఎఫ్, జోనల్ లెవల్ స్పోర్ట్స్ మీట్‌ను ఘనంగా ప్రారంబించగా, క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు శుక్రవారం సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమ తులు అందజేశారు.
ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన అవకాశాలు కల్పించి ప్రోత్సహిం చాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ క్రీడాకారులకు క్రీడల ద్వారా ప్రతిభకు ప్రోత్సాహం అనే లక్ష్యంతో క్రీడా పోటీ లను నిర్వహించడం అభినందనీయమన్నారు.
విద్యార్థులు చదువు తో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వా సాన్ని పెంపొందిస్తా యని అన్నారు. ఈ పోటీల ద్వారా ప్రతిభను కనబరిచిన క్రీడాకారులు భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించా లని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మాచ్ది రాజు గౌడ్, ఆర్ టిఐ మెంబర్ మంథని సురేష్, పీఈటి దొమ్మటి రవి, కొమురోజు శ్రీనివాస్, వివిధ పాటశాలల ఉపాద్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
