తెలంగాణ మెడికల్ సీట్లు..., తెలంగాణ విద్యార్థులకే ఇవ్వాలి....!
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ నీట్ తల్లితండ్రుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో హాజరై ప్రసంగించిన డిఎస్ఎప్ఐ జాతీయధ్యక్షుడు డాక్టర్ వివేక్...
తెలంగాణ తెచ్చుకున్నదే "మన నీళ్ళు - నిధులు - నియామకాలు" కోసం కానీ నేడు తెలంగాణ లో మన నియామకాలు వేరే రాష్ట్రం వారు దోచుకుపోతున్నారు అంటే యావత్ సమాజం సిగ్గుపడాలి అని డాక్టర్ వివేక్ అన్నారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 150 సవరించకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నీట్ విద్యార్థులతో అసెంబ్లీ స్తంభింపచేస్తామని డాక్టర్ వివేక్ హెచ్చరించారు..
తెలంగాణ రాష్ట్ర మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థుల హక్కు.. వాటిని ఇతర రాష్ట్రాల విద్యార్థులకు దోచిపెట్టే జీవో నెంబర్ 150ను వెంటనే సవరణ చేయాలని డాక్టర్ వివేక్ డిమాండ్ చేశారు..
ఈ రౌండ్ టేబుల్ సమావేశం నీట్ విద్యార్థుల తల్లి తండ్రులు సంఘం నాయకుడు యాదగిరి అద్యక్షతన జరగగా కార్యక్రమంలో ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ, గాలి వినోద్ కుమార్,డిఎస్ఎప్ఐ రాష్ట్ర కార్యదర్శి కెలోత్ సాయికుమార్, కోశాధికారి గుగులోతు సూర్య ప్రకాష్, తెలంగాణ క్రాంతిదళ్ పృధ్వీరాజ్, తెలంగాణ శ్యామ్, సామాజిక ఉద్యమకారుడు బక్క జడ్సన్ , ఖమ్మం డాక్టర్ మెడికల్ అకాడమి చైర్మన్ రాయల సతీష్ బాబు, ఏఐఎస్ఎప్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి, పిడిఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు, యుఎస్ఎప్ఐ రాష్ట్ర నాయకులు మధు, వివిధ జిల్లాల బాద్యులు, విద్యావంతులు, పాల్గొన్నారు..
