ఆదివాసీ ప్రాంతాల్లో కోలాటాలు సందడి చేస్తున్నాయి. ఆనవాయితీగా వస్తున్నా సాంప్రదాయ కోలాటం ను ఆకాడి,పోర,ఆకూర్ పోక్ &దీవాడీ నెలల్లో ఘనంగా నిర్వహిస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా వారి సాంప్రదాయ నృత్యనీ కాపాడుతూ, వారి గుర్తింపు నీ ప్రపంచానికి చాటి చెప్తున్నారు . దీపావళి నెలలో బోగి నుంచి కొలబొడి వరకు గుసాడీ వేశ ధారణలో ఉండి వారి రాక పోకలు జరుపుకుంటారు. ఎత్మ సూర్ దేవతల్లో పర్ర-వేట్టే& గుమేలంగ్ ,డప్,తుడూమ్,గుసాడి తాదో, పోరీక్, డియూర్, డియంగ్ ఉంటారని హీరాపూర్ జె పటేల్ ఆత్రం దర్ము & మాజీ MPTC బిరసైపేట్ ఆత్రం లచ్చు పటేల్ అన్నారు.దీపావళి వచ్చేంత వరకు కోలాటాన్నీ ప్రాక్టీస్ చేస్తుంటారూ అని హీరాపూర్ జె గ్రామపంచాయతీ సర్పంచ్ ఆత్రం గంగారాం మురాడి వివరించారు . చిన్న-పెద్ద &ముసాలి-ముతక చూసి ఆనందిస్తారు. కోలాటం మద్యలో వారి గోండి భాషలో కామెడీ,డొల్కీ పాటలు పాడుతూ అలరిస్తారు. వారి యొక్క ప్రత్యేక దుస్తులతో, కాళ్ళకు గజ్జెలతో చూడ ముచ్చటగా ఉంటారు.