జపాన్లో ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పారా ఆసియా క్రీడలకు 166 మంది అథ్లెట్లతో కూడిన భారత బృందానికి కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది. శీతల్ దేవి, అవని లేఖరాలాంటి స్టార్ అథ్లెట్లు బరిలో నిలవనున్నారు. ఆరోపణలు ఎదుర్కొన్న షూటింగ్ కోచ్ జై ప్రకాశకు చోటు దక్కకపోగా, సైక్లింగ్లో అర్హత సాధించని వారిని అధికారులు పక్కనపెట్టారు.