భారతదేశంలో ఎఫ్ సిరీస్ ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఒప్పో సంస్థ హైదరాబాద్ మార్కెట్లోకి సరికొత్త F35 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో 8,000 Mah బ్యాటరీతో కూడిన F35 ప్రో 5G, F35 5G మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్లలో 50mp అల్ట్రా-వైడ్ సెల్ఫీ కెమెరా, 50mp ప్రధాన కెమెరా, 4కే వీడియో రికార్డింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7360 మ్యాక్స్ ప్రాసెసర్, 144హెర్ట్జ్ అమోలెడ్ డిస్‌ప్లే వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. F35 ప్రో 5జీ ప్రారంభ ధర రూ. 45,999 కాగా, F35 5జీ ప్రారంభ ధర రూ. 39 వేలుగా నిర్ణయించారు...