బెంగళూరులో అప్పు వడ్డీ చెల్లించలేదని ఓ మహిళను కిడ్నాప్ చేసి, నగ్నంగా మార్చి విచక్షణా రహితంగా దాడి చేసి, వీడియో తీసి బెదిరింపులకు పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం తీసుకున్న రూ. 1.50 లక్షల అప్పుకు ఆరు నెలలుగా వడ్డీ కట్టకపోవడంతో, పని ఇప్పిస్తామని పిలిపించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలిని రక్షించి, నిందితులను అరెస్ట్ చేశారు.