శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం. మహాలయ విధి నాలుగు రకాలు. భౌతిక శరీరం మొదటిది, కనిపించేది. రెండవది ప్రేత శరీరం. మూడవది ఆత్మ సూక్ష్మ శరీరం. ఈ మూడింటి ప్రతీకలు మహాలయ సంకల్పంలో చెప్పుకునే వసు, రుద్ర, ఆదిత్య రూపాలు. ఈ మూడు రూపాలలో పితరులకు, అగ్నిముఖం, బ్రాహ్మణ భోజనం, ఉపవాసం నాలుగు పద్ధతులలో శ్రాద్దం ఆచరణీయం. పితృపక్షాలలో చివరి రోజైన భాద్రపద అమావాస్యను మహాలయ అమావాస్య అని అంటారు.