మారుతి దేవాలయంలో గణపతికి పూజలు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల డివిజన్ 16 మారుతి దేవాలయం లో ఏర్పాటుచేసిన గణపతి ఉత్సవాల్లో 16వ డివిజన్ కి చెందిన బోయిని సత్యనారాయణ మరియు వారి దంపతులు పాల్గొని స్వామి వారికి పూజలు నిర్వహించే తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఉండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని దేవాలయ పూజారి రాధారపు శర్మ గారు తెలిపారు.
